calender_icon.png 14 May, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీ అధికారి ఆమోదం లేకుండానే అనుమతి జారీ

14-05-2025 12:00:00 AM

నిర్మాణ అనుమతిపై తిరిగి విచారణ.. ఫిర్యాదుతో నోటీసు అందజేత

ఇష్టారాజ్యంగా గ్రామపంచాయతీ ఈవోల పని తీరు.. డీఎల్‌పీవో శ్రీనివాస్  

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో కొన్ని సంవత్సరాలుగా గృహ నిర్మాణ అనుమతి పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ అనుమతిని ఈమధ్య పంచాయతీ సెక్రటరీ అనుమతిని మంజూరు చేయగా దానిపై ప్రత్యర్థి తీగల తిరుమల గౌడ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై మంగళవారం డిఎల్పిఓ శ్రీనివాస్ రెడ్డి, దోమకొండ గ్రామపంచాయతీని సందర్శించి నిర్మాణ అనుమతిపై పంచాయితీ కార్యదర్శి యాదగిరిని వివరాలను అడిగి తెలుసుకుని ధ్రువపత్రాలను పరిశీలించారు. ఆన్లున్లో సమర్పించిన దస్తావేజుల ప్రకారం అనుమతి పొందిన రవీందర్ రెడ్డి నూతన దస్తావేజులు సమర్పించకపోవడంపై నోటీసులు జారీ చేయమని పంచాయతీ సెక్రటరీని డి ఎల్ పి ఓ ఆదేశించారు.

గృహ నిర్మాణానికి సమర్పించిన దస్తావేజులు సరిగా లేకపోవడంపై నూతన దస్తావేజులు సమర్పించకపోవడంపై నోటీసులు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యేక అధికారి ఆమోదం తీసుకున్న తర్వాత అనుమతులు మంజూరు చేయాల్సి ఉండగా, పాలకవర్గం లేనప్పటికిని ప్రత్యేక అధికారి పంచాయితీ ఈవోల మధ్య సమన్వయ లోపంతో ఇలాంటి జరగడము ఇబ్బందికరమని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఐదు సంవత్సరాలుగా అనుమతించకుండా నిలిపివేసిన అనుమతి ఈమధ్య నూతనంగా పంచాయితీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించగానే గృహ నిర్మాణానికి అనుమతించడంపై నూతన పంచాయతీ కార్యదర్శిపై పలు అనుమానాలు వ్యక్త నవ్వుతున్నాయి.

ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ అనుమతిపై గతంలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న దస్తావేజులపై పరిశీలన చేయలేకపోవడం విచారకరమని బాధితుడు తీగల తిరుమల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు ధ్రువపత్రాలను సరిగా పరిశీలించి అనుమతిస్తే తగాదాలకు తావుండదని పలువురు భావిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, పంచాయితీ ఈవో యాదగిరి, బాధితుడు తీగల తిరుమల గౌడ్ ఉన్నారు.