calender_icon.png 5 August, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

25-07-2025 01:55:44 AM

వలిగొండ, జులై 24 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన వడ్డేబోయిన మీనయ్య పురుగుల మందు తాగి చికిత్స మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కాగా స్థానిక ఎస్ ఐ యుగంధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన వడ్డే బోయిన మీనయ్య అప్పుల బాధ తాళలేక బుధవారం మోనోపోటోపాస్ పురుగుల మందును సేవించాడని వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు

చికిత్స నిమిత్తం భువనగిరికి మెరుగైన చికిత్స కోసం ఘట్కేసర్ కి తరలించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.