calender_icon.png 24 July, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి అదృశ్యం, కేసు నమోదు

22-07-2025 12:00:00 AM

రాజాపూర్ జులై 21: బాలానగర్ మండలంలోని చిన్నరేవల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ నెల 9న అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఎస్త్స్ర శివానంద్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నరేవల్లి గ్రామానికి చెందిన దసంగాని మల్లేష్ అనే వ్యక్తి ఈ నెల 9న ఇంట్లో భార్యకు చెప్పకుండా పోయినట్లు తెలిపారు.

గతంలో మల్లేష్ హైదరాబాద్ లో ప ని చేసే వాడని పనికి పోయేముందు భార్య జ్యోతికి చెప్పి వెళ్ళేవాడు. ఈ సారి చెప్పకుండా పోవడంతో భార్య కుటుంబ సభ్యులు మల్లేష్ ఆచూకీ కోసం గాలించిన దొరకలేదు. దీనితో సోమవారం భార్య జ్యోతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.