22-07-2025 12:00:00 AM
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కోదాడ, జులై 21 : నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి, ప్రజల బాగు కోసం పాటుపడిన సిపిఐ నేత దొడ్డ నారాయణ రావు జీవితం ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని చిలుకూరు మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డ నారాయణరావు సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనం బాధలు తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
స్వాతంత్ర పోరాటంలోనూ సాయుధ పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించిన గొప్ప నాయకుడు అన్నారు. జనం బాధలు తెలిసి వాటి పరిష్కారం కోసం ఎంతో కృషి చేశాడన్నారు. రాజకీయాల్లో మానవ విలువలు పెంచాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, గన్న చంద్రశేఖర్, జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నాగార పాండు, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, బొమ్మ కంటి ప్రభాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.