calender_icon.png 25 July, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూప్రాన్‌లో జోరుగా గావు రంగం!

22-07-2025 12:00:00 AM

భవిష్యవాణి చెప్పిన అమ్మవారు

తూప్రాన్, జూలై 21 : మూడు రోజుల పాటు నిర్విరామంగా, ఆహ్లాదకరంగా కొనసాగుతున్న మహంకాళి జాతర ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు గావులు, రంగాల కార్యక్రమాన్ని అద్భుత రీతిలో నిర్వహించారు. ముందుగా అమ్మవార్లకు పూజా కార్యక్రమాన్ని చేసి అనంతరం లింగ గావు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన భవిష్య వాణిలో పలు అంశాలను వివరించారు,

ముఖ్యంగా ఈ ఏటా పుష్కలమైన వర్షం కురుస్తుందని, కానీ పట్టణంలో ఊరడమ్మకు పెద్ద చెరువు కట్ట మీద ఉన్న మైసమ్మకు పండుగ చేయాలని హెచ్చరించింది. లేనిపక్షంలో పట్టణంలో అవాంచనీయ ఘటనలు చోటు చేసుకుంటాయని అమ్మవారు హెచ్చరించింది. తదనంతరం మహా కుంభగావు నిర్వాహణ కార్యక్రమాన్ని పనివారలతో నిర్వహించారు.

దారి పొడుగున పలారం బండ్లు, తొట్టెల ఊరేగింపులు, ప్రత్యేక శివశక్తుల పునీత పూనకాలతో శివాలెత్తిన శిగాలు అద్భుతంగా కొనసాగాయి, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, తాజా మాజీ చైర్మన్ మామిళ్ళ జ్యోతి కృష్ణ, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.