calender_icon.png 30 January, 2026 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సన్నాహక సమావేశానికి తరలిరండి

30-01-2026 08:26:03 PM

జాతీయ మాల మహానాడు మండల ప్రచార కార్యదర్శి కొంగూరు సత్యనారాయణ

చర్ల,(విజయక్రాంతి): మండల పరిధిలోని తేగడ వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ సన్నాహక సమావేశానికి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని జాతీయ మాల మహానాడు మండల ప్రచార కార్యదర్శి కొంగూరు సత్యనారాయణ పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... జాతీయ మాల మహానాడు జిల్లా కమిటీ సూచనలతో మండల కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మండల పరిధిలోని ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన తేగడ గ్రామం వై జంక్షన్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకొని

ఫిబ్రవరి 1 ఆదివారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు మండల కేంద్రంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మండల మాల మహానాడు నాయకుల, కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ నాయకులు,డివిజన్ నాయకులు, మండల సీనియర్ నాయకులు విచ్చేస్తున్నారని, సమావేశంలో త్వరలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి సంబంధించిన విధి విధానాలు, భవిష్యత్తు కార్యాచరణ, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ ఏర్పాటు, ఆహ్వాన కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయాన్ని, కమిటీల ప్రకటనను ఆదివారం ప్రకటించనున్నట్లు వెల్లడించారు.