calender_icon.png 22 November, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితుల పక్షపాతి ఎమ్మెల్యే నాయిని

22-11-2025 10:31:44 PM

రాష్ట్ర దళిత విభాగం వైస్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలో రాష్ట్ర దళిత విభాగం టిపిసిసి సీనియర్ వైస్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దళితులకు ఏ కష్టమొచ్చినా వెన్నంటి ఉంటూవారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. దళిత క్రైస్తవులకు  చనిపోతే సమాధి చేయడానికి భూమి లేకపోతే స్మశాన వాటికకు మూడు ఎకరాల భూమి కేటాయించిన ఘనత ఎమ్మెల్యే నాయిని అని అన్నారు. కొన్ని దశాబ్దాల కల ఎస్సీ వర్గీకరణను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దాని అన్నారు.

ఎమ్మెల్యే నాయిని, తాటికొండ రాజయ్యని ఉద్దేశించి మీ పదవి పోవడానికి కారణం బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కాదా, ఆర్.ఎస్ ప్రవీణ్ ని ఉద్దేశించి పలుమార్లు కేసీఆర్ ను ఏకిపారేసిన మీరు బిఆర్ఎస్ లో ఎలా జాయిన్ అయ్యారు అని మాత్రమే అన్నారు. ఆ మాటలు దళితుల ఆత్మగౌరవం కోసం మాట్లాడినట్టే కదా అని దళిత వర్గాలను కోరుతున్న అని రామకృష్ణ అన్నారు. కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి విజయ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చేయలే, ఉన్న డిప్యూటీ సీఎం పదవిని కూడా తీసేసి దళితులను అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి గురిచేసి, పక్కన కూర్చో పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డ కెసిఆర్ కదా అని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకులు దాస్యం వినయ్ భాస్కర్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, తాటికొండ రాజయ్య లు మీడియా ముందుకు వచ్చి మైక్ మీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. 

మీ సవాళ్లు స్వీకరించి ఎమ్మెల్యే నాయిని బస్టాండ్ కి గన్ మెన్ లు, ఎలాంటి వెహికల్స్ లేకుండా సింగిల్ గా టూవీలర్ పై వచ్చారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఉంటే మీరు లేరా మాకు భరోసాగా ధైర్యం నింపేందుకు అని చిరు వ్యాపారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నాయకుడు ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అని, మరి ఇంకొకసారి మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుప్పటి కోటి, ప్రసన్నకుమార్, భాస్కర్, రాజేందర్, పోచయ్య, కృష్ణ, వెంకట్, రమేష్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.