22-11-2025 10:34:46 PM
అభినందించిన ఎమ్మెల్యే తలసాని..
సనత్‌నగర్ (విజయక్రాంతి): విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని శాంతి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుపొందారు. శనివారం విద్యార్థులు వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తాము గెలుచుకున్న కప్ ను ప్రదర్శించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులను అభినందించారు. స్కూల్ కరస్పాండెంట్ అనూష, ప్రిన్సిపాల్ ఆంజనేయ ప్రసాద్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.