22-11-2025 10:28:36 PM
మంథని కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్..
మంథని (విజయక్రాంతి): మండలంలోని వెంకటపూర్ లో యూత్ కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, మంథని డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, సూచన మేరకు మంథని మండలం వెంకటపూర్ గ్రామంలో మంథని మండల యూత్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వెంకటపూర్ యూత్ కమిటీ నియమించినట్లు తెలిపారు.
గ్రామ శాఖ అధ్యక్షులుగా రిక్కుల రాజేందర్, ఉపాధ్యక్షులుగా దాగం రమేష్, ప్రధాన కార్యదర్శిగా పిట్టల నాగరాజు, కార్యదర్శిగా చిట్యాల ప్రవీణ్, కోశాధికారిగా కొత్తపల్లి మధుకర్, అధికార ప్రతినిధిగా రేగటి మల్లికార్జున, ప్రచార కమిటీ కన్వినర్ గా నాగునూరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా అనపర్తి రాజబాపు, బండారి శ్రీను, గూడ మల్లన్న, బండారి అంజి, మేకల రమేష్, పంచిక శ్రీధర్, గూడ రాజన్న, గూడ సమ్మన్న, తాడవేనా విజయ్, జంగ స్వామి, బండారి అనిల్, బండారి విజయ్, బండారి నరేష్ లను నియమించారు.
ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నూకల కమల్ మాట్లాడుతూ పార్టీని భలోపేతం చేయడానికి ఉత్సహంగా పనిచెయ్యాలని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు రాజి రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయుకులు అనపర్తి రాజబాపు, బండారి అంజి, పిట్టల నాగరాజు, బండారి శ్రీను, గూడ మల్లన్న, గూడ సమ్మన్న, యూత్ కాంగ్రెస్ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.