calender_icon.png 8 November, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఈటీకి పూర్వవిద్యార్థుల సన్మానం

08-11-2025 12:00:00 AM

కొల్లాపూర్ టౌన్ నవంబర్ 7: మండల కేంద్రంలోని లోటస్ మ్యాన్షన్ హాల్లో శుక్రవారం పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పిఈటీ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. 41 ఏళ్లపాటు సేవలందించి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రానించే విద్యార్థులకు శిక్షణనిచ్చినట్లు పూర్వ విద్యార్థులు కొల్లాపూర్ తహసిల్దార్ భరత్, రంగారెడ్డి తహసిల్దార్ పార్థసారథిలు తెలిపారు. విశ్రాంతి జీవితంలోనూ సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.