calender_icon.png 8 November, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్‌లో హ్యాష్ ఆయిల్ పట్టివేత

08-11-2025 12:00:00 AM

శేరిలింగంపల్లి, నవంబర్ 7 (విజయక్రాంతి): మియాపూర్ లో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎస్ వోటీ) పోలీసులు చేధించారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశా రు. పట్టుబడ్డవారి నుంచి మూడు లక్షల విలువ చేసే 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి హై దరాబాద్‌కు తరలిస్తున్న హ్యాష్ ఆయిల్ ముఠా లో ఒడిస్సాకు చెందిన సోనియా అనే వ్యక్తి కీలక సూత్రధారి అని పోలీసులు తెలిపారు.

సోనియాకు సహాయం చేస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు పోలీసులు వెల్లడించారు. లక్ష్మి, దుర్గ ప్రసాద్, దుర్గలను సైతం మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్నహ్యష్ ఆయిల్ ను మాదాపూర్ ఎస్‌ఓటీ టీం మియాపూర్ పోలీసులకు అ ప్పగించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.