20 August, 2026 | 1:28 AM

గీతంలో ఘనంగా ఫార్మకాలేజీ దినోత్సవం

20-08-2026 12:19 AM

అతిథిగా పాల్గొన్న ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి శ్రీనివాసన్

పటాన్ చెరు, ఆగస్టు 19 : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్పీ), ‘మెరుగైన ఆరోగ్యం కోసం ఔషధ ఆష్కరణను ప్రోత్సహించడం’ అనే ఇతివృత్తంతో రెండవ జాతీయ ఫార్మకాలజీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. భారతీయ ఫార్మకాలజీ వ్యవస్థాపకుడైన కల్నల్ ఆర్.ఎన్. చోప్రాను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం, ఔషధ ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడంలో, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో ఫార్మకాలజీ పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా చాటింది.

హైదరాబాదులోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి శ్రీనివాసన్ ముఖ్య అతిథిగా హాజరై, ఈ-అబ్ స్ట్రాక్ట్ పుస్తకాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ‘ఔషధ ఆవిష్కణలో ప్రీక్లినికల్ ఫార్మకాలజీ.. అంతర్దృష్టులు, సవాళ్లు, పురోగతులు, అవకాశాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ,

ఔషధ ఆవిష్కణ, ప్రీక్లినికల్ నమూనాలు సమర్థత, భద్రత, ఎక్స్ పోజర్, అభివృద్ధి చెందుతున్న విధానాలు, పరిశోధనను సమర్థవంతమైన మందులుగా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లపై విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు.  మెరుగైన ఆధారాలు, మెరుగైన నిర్ణయాలు, వేగవంతమైన అనువాదం, మెరుగైన ఆరోగ్యాన్ని సాధించడమే అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు. ‘ఔషధ ఆవిష్కరణను మెరుగైన ఆరోగ్యం కోసం ఆధారాలుగా మార్చే వారధియే ప్రీక్లినికల్ ఫార్మకాలజీ’ అని ఆయన పేర్కొన్నారు.