20 August, 2026 | 1:19 AM

స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలి

20-08-2026 12:20 AM

షాద్‌నగర్, ఆగస్టు 19 (విజయక్రాంతి): బి జె వై ఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ బి జె వై ఎం అసెంబ్లీ ఇంచార్జీ పుట్నాల సాయి కు మార్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వాహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బి జె వై ఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అభినవ్ గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడిచినా విద్యార్థుల పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ విద్యార్థుల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. ప్రభుత్వం బకాయి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు.