12-05-2025 11:04:08 PM
మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి
మందమర్రి,(విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రైతులు వరి పంటను సాగు చేస్తున్నారని వరి అధిక వినియోగంతో మానవాళికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి ఆన్నారు. మండలంలోని చర్రకుంట గ్రామంలో రైతులకు వరి పంట సాగుపై కలిగే దుష్పరిణా మాలపై అవగాహన కల్పించారు. మానవులు ఆహార ధాన్యంగా వినియో గించే వరి ప్రధానంగా అధిక నీటిని వినియోగించికొని పండే పంట అని, పంట ఎదుగులలో వాయు రహిత బ్యాక్టీరియా సంగ్రహించే భార లోహాలైన ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్ వంటి ద్వారా అనేక అనర్థాలు కలుగుతాయని వివరించారు.
సాగులో మార్పులు అలవాటు చేసుకోవాలి
అకాల వర్షాలు, వడగండ్లు తదితర ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరుగు నష్టం నుండి బయట పడటానికి రైతులు పంట సాగు కాలంలో మార్పులను అలవాటు చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి కోరారు. సాగు కాలంలో పంట మార్పుల ద్వారా పంట నష్ట భయం లేకుండా ఉండవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్రకుంట మాజి సర్పంచ్ ఒడ్నాల కొమురయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.