calender_icon.png 13 October, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవ్యవస్థపై భౌతిక దాడి!

09-10-2025 12:00:00 AM

రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్యానికి స్వతంత్య్ర న్యాయ వ్యవస్థ మూలస్తంభం లాంటిది. సంవిధానాన్ని, దాని మౌలిక నిర్మాణాన్ని ఎవరు బీ టలు వార్చకుండా న్యాయవ్యవస్థ కావలికాస్తుంది. జనజీవితాలను దుర్భరం చేసే అవినీతి,అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ప్రభుత్వ యంత్రానికి న్యాయ వ్య వస్థ పగ్గాలు వేస్తూ వస్తుంది. ఈ మేరకు న్యాయమూర్తులు నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించగలిగితేనే అన్ని వేళలా అన్నిచోట్ల న్యాయం నిలుస్తుంది.

అయితే కొన్నేళ్లుగా మన దేశంలో జడ్జిలపై వ్యక్తితగ దూషణలు, భౌతిక దాడులకు తెగబడే వికృత సంస్కృతి పెరిగిపోతుంది. అందుకు తాజా ఉదంతమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన భౌతిక దాడి. సుప్రీంకోర్టు లోపలే సిట్టింగ్ జడ్జి జస్టిస్ రాకేశ్ కిషోర్ బూటు విసిరిన చర్య ఒక వ్యక్తి ఆగ్రహ చర్య ఎంత మాత్రం కాదు. ఇది మన దేశం మానసిక రుగ్మతల వాతావరణాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. న్యాయస్థానం అనేది చట్టం ఆ ధారంగా మాట్లాడే స్థలం. ఇక్కడ భావోద్వేగాలు ముఖ్యం కాదు. నీతీ, న్యాయం, నిజాయితీ, సత్యం ఆధిపత్యం చెలాయించాలి. అయినప్పటికీ ఈ సంఘటనతో న్యాయస్థానమనే పవిత్ర గోడల్లోకి  మత అసహనం చొచ్చుకుపోయింది.

దాడులు కొత్తేం కాదు..

భారతదేశంలో పార్లమెంట్ ప్రాంగణం లో రాజకీయ నాయకులు, మంత్రులపై బూట్లు విసిరిన సంఘటనలు ప్రజల ఆగ్ర హ వ్యక్తీకరణగా జరిగాయి. కానీ ఇవాళ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి మొత్తం న్యాయవ్యవస్థనే అనుమానించినట్టవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే న్యాయ వ్యవస్థపై దాడులు జరగడం కొత్తేమీ కాదు. గతంలో జరిగిన దాడులు తమకు న్యాయం జరగలేదనో లేదంటే  న్యాయం విలువ తెలియని మతిస్థిమితం లేని వ్యక్తు లు రాజ్యాంగ బద్ధ సంస్థపై దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈసారి జరిగిన దాడి అందుకు భిన్నంగా ఉంది.

ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అయిన జస్టిస్ రాకేశ్ కిషోర్ బూటు విసరడం అం తకు మించిన చర్చలా మారిపోయింది. 16 ఏళ్ల క్రితం ఒక కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్‌పై ఒక మహిళ చెప్పు విసిరిన ఉదంతం కలకలం సృష్టించింది. అంతకుముందు 1968 మార్చిలో అప్పటి సీజే జస్టిస్ హిదయతుల్లా, జస్టిస్ గ్రోవర్, జస్టిస్ వేదలింగంతో కూడిన ధర్మాసనంపై మతిస్థిమితం లేని ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆనాటి ఘటనలో జస్టిస్ గ్రోవర్ గాయపడ్డారు. ఇది భయానక వాతావరణం కల్పించినప్పటికీ నిబ్బరంగా వ్యవహరించిన జస్టిస్ హిదయతుల్లా ఆ దుండుగుణ్ణి కొట్టవద్దం టూ పోలీసులకు సూచించారు. ‘న్యాయమూర్తుల తీర్పులను నిర్మాణాత్మకంగా, విమర్శనాత్మకంగా పరిశీలించడానికి బదు లు జడ్జిలకు వ్యతిరేకంగా వ్యక్తిగత అభిప్రాయాల వెల్లడిపైనే సోషల్, డిజిటల్ మీడి యా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.

దీనివల్ల న్యాయవ్యవస్థకు హానీ జరుగుతోంది. దాని గౌరవాన్ని తగ్గిస్తోంది’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవా లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా జరుగు తున్న దుష్ప్రచారంలో నుంచి పెల్లుబికిన అసహనమే సీజేఐపై దాడి యత్నానికి కారణమైంది. అయితే ఇది న్యాయం, చట్టం, ధర్మం, రాజ్యాంగ క్రమం తదితర ఆదర్శాలపై జరిగిన అమానుష దాడిగా పేర్కొనవచ్చు. న్యాయమూర్తులపై ఇటువంటి నిరసనలు చరిత్రలో చాలా అరుదు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో కూడా సుప్రీం కోర్టు గౌరవం అలాగే ఉండిపోయింది. న్యాయమూర్తి  జస్టిస్ హె.ఆర్. ఖన్నా వృత్తిపరంగా ప్రమాదంలో పడినప్పటికీ, తన సిద్ధాంతాల్లో, వ్యక్తిత్వం విష యంలో ఎన్నడూ రాజీ పడలేదు.

హెచ్చుమీరుతున్న ఆగ్రహం

ఇవాళ ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై లేవనెత్తిన బూటు మన న్యాయ సం స్కృతిలో దుఃఖ క్షీణతను సూచిస్తుంది. ‘సనాతన సంకుచిత ధర్మం’ పేరుతో సాం స్కృతిక దుందుడుకుతనం, రౌడీయిజం తీవ్రమైంది. ఈ దుశ్చర్యను చేపట్టిన వ్యక్తి న్యాయవాది ముసుగులో ఉన్న హిందుత్వ ఉగ్రవాదిలా కనిపిస్తున్నారు. ‘సనాతనానికి ఎలాంటి అవమానాన్ని సహించము’ అని ఆయన అరిచారు. ఇక్కడే నిజమైన సమ స్య మొదలవుతుంది. వ్యక్తులు తమ భావజాలాన్ని మానవత్వం కంటే ఎక్కువగా ఉన్నతీకరించినప్పుడు సనాతన ధర్మం.. సంయమనం, కరుణ విలువలను బోధించలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

మతం, ధర్మం, కులం, సంస్కృతి.. ఇప్పుడు వాదనల స్థాయి దాటి పోయి మతోన్మాదుల చేతిలో ఆయుధాలగా మారిపోయా యి. సనాతనం నిర్వచనం ప్రకారం శాశ్వతమైనది. దానికి హింస ద్వారా రక్షణ అవ సరం లేదు. కానీ ఈ రోజు సంప్రదాయ రక్షకులుగా పిలవబడుతున్న న్యాయవాదు లు దాని పునాదిని, విలువైన సహనాన్ని విడిచిపెట్టి ఉగ్రవాద రూపానికి మారిపోతుండడం శోచనీయం. వారు రక్షిస్తున్నది ధర్మాన్ని ఎంత మాత్రం కాదన్న విషయం అర్థం చేసుకోవాలి. నిజానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవా య్ గౌరవప్రదమైన జనాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.‘న్యాయవాదులు తమ వాదనలను సమర్పించనివ్వండి.

ఈ చర్యలు నన్ను ప్రభావితం చేయవు. న్యాయవాదు లు శాంతిని కాపాడటం నేర్చుకోవాలి.’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఆయ న  కేసును వినడం కొనసాగించారు. ఈ ఒక్క వాక్యం సమకాలీన రాజకీయ భాషపై తీర్పుగా నిలుస్తుంది. ప్రస్తుత పాలనా కాలంలో, ఆగ్రహం చట్టం కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. చట్టం ముందు ఎవరైనా సరే ఆగ్రహం, సంయమనంతో నియంత్రణలో ఉండాల్సిన అవసరముంది.

గౌరవం తప్పనిసరి

ఇక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవా య్ దళిత నేపథ్యం నుంచి వచ్చారు. న్యా య వ్యవస్థలో అత్యున్నత స్థాయి హో దాకు ఆయన చేరుకోవడం గొప్ప విష యం. ఇది మన ప్రజల సమానత్వ స్ఫూర్తి కి, రాజ్యాంగం ద్వారా సాధ్యమైన అవకాశానికి నిదర్శనం. అయితే ‘సనాతనం’ పే రుతో ఆయనపై దాడి జరగడమనేది కుల వాదం, మతపరమైన అసహనం, క్షీణ భావజాల సంస్కృతికి ప్రతీక. ఈ తీవ్రవాదం మన దేశానికి చాలా ప్రమాదకర మైంది. న్యాయస్థానం గౌరవమే.. సమాజ గౌరవం అన్న విషయం ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి.

సుప్రీంకోర్టు కేవలం న్యాయ సంస్థ మాత్రమే కాదు, ఇది మన దేశానికి నైతిక శిఖరం. అలాంటి న్యాయవ్యవస్థను ఇలాంటి భౌతిక దాడుల ద్వారా అపవిత్రం చేయాలని చూసే ప్రయత్నం మన గణతం త్ర నీతి, ధర్మంపై చేసిన దాడి కిందే లెక్క. ఇటువంటి సంఘటనలు సామాన్యమైనవి కావు. అవి సమాజంలో పెరుగుతున్న అవిశ్వాసం, అసహనం, ఆవేశపూరిత అ జ్ఞానాన్ని సూచిస్తాయి. జనాభి ప్రాయం కే వలం హింస ద్వారా మాత్రమే బలహీనపడదు. న్యాయవ్యవస్థపై గౌరవం త గ్గినప్పుడు కూడా అది క్షీణిస్తుంది. అయి తే ఇప్పటికీ న్యాయవ్యవస్థపై గౌరవం ఉం డడం మనలో మానవత్వం ఉందనడానికి నిదర్శనం. బూటు విసరడం న్యాయానికి చిహ్నం కాదు..- అది దాని అంతం. ఈ పత నం మన దేశంలో 2014 నుంచే ప్రారంభమయింది.

దేశంలో ‘ఫ్యాసిజం’ విజృం భణకు చిహ్నం. దీనిని మొగ్గలోనే తుంచి వేయాల్సిన అవసరముంది. ఈ దాడితో మన సమాజం తప్పనిసరిగా ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. న్యాయవ్యవస్థ ప నితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూ పించే ఇ లాంటి పోకడలు మన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. న్యాయవ్యస్థ స్వ తం త్రకు భంగం వాటిల్లకుండా చూడాల్సి న బాధ్యత అందరిపై ఉంది. చివరిగా న్యా యంపై నమ్మకం ఉన్నవాడు విజయం సా ధిస్తాడు.. కానీ న్యాయాన్ని తిరస్కరించేవా డు చరిత్ర హీనుడై పతనం చెందుతాడు.

     వ్యాసకర్త సెల్: 9849328496