5 April, 2026 | 5:28 AM

‘ ఫిజిక్స్ వాలా’ ఓరియంటేషన్ ప్రోగ్రాం

05-04-2026 12:51 AM

ఫౌండేషన్, జేఈఈ, నీట్‌పై దిశా నిర్దేశం  

హైదరాబాద్, ఏప్రిల్ 4(విజయక్రాంతి): ఇండియాలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి విద్యాసంస్థ ఫిజిక్స్ వాలా మేనేజ్మెంట్ శనివారం  నోమా కన్వెన్షన్ హాల్, నాచారం లో ఫౌండేషన్, జేఈఈ, నీట్ పై ‘దిశా నిర్దేశ కార్యక్రమం’ నిర్వహించింది. ఈ సదస్సుకు 1400 మంది పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.

తెలంగాణ ప్రాంతానికి సం బంధించి పీడబ్ల్యూ విద్యాసంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి  మాట్లాడుతూ 20 రాష్ట్రాల్లో 200 బ్రాంచ్‌లతో దేశంలోనే అగ్రస్థానంలో విద్యావ్యవస్థ కొనసాగుతూ హైదరాబాద్‌లో (మాదాపూర్, మియాపూర్, కూకట్ పల్లి, హబ్సిగూడ, కొత్తపేట్, ఏఎస్ రావు నగర్, సుచిత్ర, షేక్ పేట్, మణికొండ, నల్లగండ్ల )10 బ్రాంచ్‌లను ఏర్పాటుచేసి విద్యా విధానంలో నూతన పద్ధతులతో అత్యుత్తమ విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు.

బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి ఎదగాలనే కాంక్ష ఉన్న ఏ విద్యార్థి నైనా సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో ఫిజిక్స్ వాలాని ప్రారంభించామన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా అన్ని క్లాస్ రూమ్‌లు డిజిటల్ బోర్డ్స్‌తో, ఏసీ క్లాస్ రూమ్‌లను కలిగి, ప్రతి క్లాసులో టీచింగ్ చేసిన లెక్చరర్‌ని రికార్డింగ్ చేసి ప్రతి స్టూడెంట్ కి అదే రోజు పీడబ్ల్యూ ఆప్‌లో అప్‌లోడ్ చేయబడతాయన్నారు. తద్వారా ఏదైనా టాపిక్ విద్యార్థికి అర్థం కాకపోయినా, కన్ఫ్యూజ్ అయిన, మర్చిపోయినా రికార్డింగ్ లెక్చరర్‌ని యాప్‌లో విన డం ద్వారా పూర్తిగా నేర్చుకోగలుగుతాడని చె ప్పారు.

హైదరాబాద్ రీజియన్ సీఈవో డాక్టర్ ఇరుకుల్ల మునీందర్ మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం పర్ఫెక్ట్ ఫౌండేషన్ కోచింగ్ తోబాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు సంవత్సరాల ఐఐటి జేఈఈ కోచింగ్ తో పాటు వివిధ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివి ఐఐటీ నీట్ లో సీట్ రాని విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇ స్తున్నామని తెలిపారు.

అకాడమిక్ డైరెక్టర్ డాక్ట ర్ ఆనంద్ రామన్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా విద్యావ్యవస్థలో ఉండి ఎన్నో వేల మంది సాధారణ విద్యార్థులను కూడా ఐఐటీ నీట్‌లలో ఉత్తమ ర్యాంకులు సాధించే విధంగా ప్రోగ్రాం చేసి అది విద్యార్థుల చేత వర్క్ చే యించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధింప చేశామని తెలిపారు.హైదరాబాద్ ప్రాంతంలో ఫిజిక్స్ వాలాను ఏర్పాటు చేయటం తెలంగాణ ప్రాంత విద్యార్థులకు జాతీయస్థాయిలో చాలా అలవోకగా విజయం సాధించడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని తెలిపారు.