calender_icon.png 3 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత కార్మికుల హక్కుల కోసం పోరాటం

02-11-2025 06:05:57 PM

భైంసా: తెలంగాణ రాష్ట్రంలో గీతా కార్మికుల హక్కుల కోసం మోకు దెబ్బ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు అమరవీరి నర్సాపూర్ అన్నారు. ఆదివారం బైంసా పట్టణంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కనక గౌడ్, అశోక్ గౌడ్ నియమించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తి రక్షణ గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకుదెబ్బ కృషి చేస్తుందన్నారు.

గ్రామాలలో విడిసిల పేరిట కల్లుగీత కార్మికులపై వేదిస్తూ నిలువు దోపిడి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బిల్లోల శరత్ గౌడ్, నక్కల బాబ గౌడ్, గుడిసెల నారాయణ గౌడ్, కొండ అర్జున్ గౌడ్, తాళ్లపల్లి మహేష్ గౌడ్, లింగాల కృష్ణ గౌడ్, పాతూరి రవి గౌడ్, కొండ కృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, బొడ్డు రాజు గౌడ్, కొండ సతీష్ గౌడ్, లింగాల రాజు గౌడ్, లింగాల నర్సా గౌడ్, ముత్యపు వార్ నరేష్ గౌడ్ తాళ్ళ పల్లి రమేష్ గౌడ్, జిల్లాలోని పలు మండలాలలోని గ్రామాల గౌడ కులస్తులు గీత కార్మికులు పాల్గొన్నారు.