2 July, 2026 | 4:09 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

నేటినుంచి అందుబాటులోకి పీజేఆర్ ఫ్లైఓవర్

28-06-2025 12:08 AM
  1. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
  2. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జోన్‌లో ఈ నెల28న సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జోనల్, ప్రాజెక్ట్ ఇంజినీర్లతో కలిసి పీ జనార్దన్‌రెడ్డి (శిల్పా లేఔట్ ఫేస్ ఫ్లైఓవర్‌ను  పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రూ.182.72 కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్ వరకు 1.20 కిలోమీటర్లతో 6 లైన్ బై డైరెక్షన్ శిల్ప లే ఔట్ ఫేస్ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించినట్టు తెలిపా రు. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని చెప్పారు.

తిరుగు ప్రయాణం లో  కొండాపూర్‌కు వెళ్లేందుకు గచ్చిబౌలి జంక్షన్‌లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా సకాలంలో గ మ్యస్థానానికి వెళ్లేందుకు వెసలుబాటు ఉంటుందని కమిషనర్ కర్ణన్ తెలిపారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ హేమం త్ సహదేవ్‌రావు, ప్రాజెక్ట్ సీఈ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఈఈ పాల్గొన్నారు.