01-11-2025 04:47:47 PM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట,(విజయక్రాంతి): జిల్లాలో వ్యవసాయ అనుబంధాల రంగాల అభివృద్ధికి పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుపై వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, హార్టికల్చర్, మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో ఆయా రంగాల ఉత్పాదకతలను పెంచేలా అన్ని పారామిటర్స్ కూడిన డాక్యుమెంటేషన్ కు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఆ పథకం అమలు కోసం మన జిల్లాకు కేంద్రం నుంచి ఓ ప్రత్యేక ( ఐ ఏ ఎస్)అధికారి వస్తున్నారని, అందరూ తమ తమ శాఖల పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.