calender_icon.png 4 August, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం

04-08-2025 07:16:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): జనాభా ప్రాతిపాదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు సిపిఎం పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెస్లీ(CPI leader John Wesley) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి 42 శాతం రిజర్వేషన్ కోసం  కులాల బీసీలతో జేఏసీ ఏర్పడి పోరాటం చేస్తామని తెలిపారు. బీసీల రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెరిగితేనే రాజ్యాధికారం దక్కుతుందని అందుకు బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నూతన కుమార్ గౌతమ్ సురేష్ శంభు పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.