04-08-2025 07:11:46 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బుధ కుర్దు గ్రామంలో శివ గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో శ్రావణ సోమవారం సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ సామూహికంగా గాజుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల మట్టి గాజులను చేతికి నిండుగా వేసుకొని మహిళల ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటారు.
ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు సిరిపోతుల సత్యక్క, మండల మాజీ ఉపాధ్యక్షురాలు వెంబడి రాణి, బత్తుల మానస, చంద్రగిరి జ్యోతి, దాసరి భాగ్యలక్ష్మి, సారం రాజేశ్వరి, గుంపుల భాగ్యలక్ష్మి, ముత్తె రమాదేవి,తొంగల లావణ్య, సారం మహేశ్వరి, వెంబడి లక్ష్మి, నల్లిమెల జ్యోతి, వెంబడి రమ, సారం లక్ష్మి, బియ్యాల రేవతి, దాసరి రాజేశ్వరి, సామల సరోజ, అంగల సుమ, దుబాసి రాజేశ్వరి, ముత్తెకళావతి, నలిమల లత, మల్లేశ్వరి, చిలుక పద్మ, తొంగల పద్మ, పొట్లపల్లి లక్ష్మి, అంగల కళావతి తదితరులు పాల్గొన్నారు.