04-08-2025 07:19:35 PM
కుభీర్: యువత మాదకద్రవ్యాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సై ఏ కృష్ణారెడ్డి(SI Krishna Reddy) పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలకేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెడు అలవాట్లకు కనెక్ట్ కాకుండా చదువులపై ప్రత్యేక దృష్టిని సారించాలని చెడు అలవాట్ల బారిన పడితే బంగారు భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా తదితర మత్తు పదార్థాలను వినియోగించినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 14500 కాల్ చేసి తెలపాలని కోరారు.
పోలీసులు ఎల్లప్పుడూ మీకోసం సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇలాంటి వారిపై కఠినంగా పోలీస్ శాఖ వ్యవహారించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రైతు సమాజం కోసం యువత నడుం బిగించాలని నేటి విద్యార్థులే రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని కళాశాల ప్రిన్సిపల్ సునీల్ పేర్కొన్నారు. విద్యార్థులు యువకులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఇక్కడ విన్నది మీమీ గ్రామాల్లోని స్నేహితులకు, తోటి యువతకు చెప్పి వారు డ్రగ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఎస్సై లక్ష్మణ్, అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు.