calender_icon.png 4 August, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి

04-08-2025 07:14:31 PM

ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి.. 

బోయినపల్లి (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి(ASP Sheshadrini Reddy) సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా బోయినపల్లి పోలీస్ స్టేషన్ను ఏఎస్పీ సోమవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల నమోదు వివరాలు సిబ్బంది పనితీరు, కిట్ లను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, సీజ్ చేసిన వాహనాలు, సిబ్బంది క్వార్టర్స్ చూశారు. పోలీస్ స్టేషన్ సెంట్రి విధులు నిర్వహించే చోట ఉన్న చెత్తను తొలగించాలని తెలిపారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ రాజకుమార్ ఏఎస్ఐలు రాజయ్య మల్లేశం సిబ్బంది ఉన్నారు.