calender_icon.png 4 August, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్

04-08-2025 07:22:28 PM

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను కేబినెట్ ముందుంచిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 650 పేజీల నివేదికను అధ్యయనం చేసిన కమిటీ 60 పేజీల సారాంశం తయారు చేసింది. కేబీనేట్ కు సమర్పించిన సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్ పేరును, 19 సార్లు హరీశ్ రావు, ఐదుసార్లు ఈటల పేరును ప్రస్తావించారు. ప్రాజెక్టుల కోసం అధిక వడ్డీలతో రూ.84 వేల కోట్లు అప్పు తెచ్చారని, భారీ అప్పులతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

రూ.38 వేల కోట్లతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపట్టాల్సి ఉందని, ప్రాజెక్టు కోసం గతంలో రూ.11 వేల కోట్లు(32 శాతం) ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు. బీఆర్ఎస్ హయంలో మొదలు పెట్టిన కాళేశ్వరం కూలిపోయిందని, మేడిగడ్డ బ్యారేజ్ పై న్యాయ విచారణ చేస్తామని గతంలోనే హామీ ఇచ్చామన్నారు. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ చేపట్టామని, రాజకీయ అంశాలు జోడించకుండా న్యాయ విచారణ చేపట్టాలని కోరామని ఆయన వెల్లడించారు.

కమిషన్ 660 పేజీలతో నివేదికను నీటిపారుదల శాఖకు ఇచ్చిందని, నివేదికను ముగ్గురు అధికారుల కమిటీ 25 పేజీలతో సంక్షిప్తం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. 2016లో మేడిగడ్డ ప్రాజెక్టు అగ్రిమెంట్, 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన, 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సాంకేతిక కారణాలను ఎన్డీఎస్ఏ నివేదించిందని, మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్ లోపాలున్నాయని తేలిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సాంకేతిక కారణాలను ఎన్డీఎస్ఏ నివేదించిందని, మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్ లోపాలున్నాయని తేలిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఎన్డీఎన్ఏ నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో ఇదే సమస్య ఉందని తేల్చి చెప్పిందని, మూడు బ్యారేజ్ ల్లో నీటి నిల్వకు అవకాశం లేదని కమిటీ తెలిపిందని ఆయన వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఎన్డీఎస్ఏ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందని, ఎనిమిది అంశాలపై కేబినెట్ లో ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు.