calender_icon.png 4 August, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష

04-08-2025 07:06:31 PM

సీడీపీవో విజయలక్ష్మి..

కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు..

మణుగూరు (విజయక్రాంతి): తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అని సీడీపీవో పోలేబోయిన విజయలక్ష్మి(CDPO Poleboina Vijayalakshmi) అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని గుట్టమల్లారం అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీడీపీవో తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈనెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్స వాలు జరుగుతాయని తెలిపారు. పుట్టగానే తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, ముర్రుపాలు బంగారం కంటే విలువైందన్నారు. తల్లి పాలలో వున్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలల్లో వుండవని స్పష్టం చేశారు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎం లు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.