07-09-2025 01:04:13 AM
నల్గొండ రూరల్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి)ః జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి పూర్తి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభించాలని 565 జాతీయ రహదారి నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హశం, మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం ఉట్కూరు వెంకట్ రెడ్డి లు డిమాండ్ చేశారు. శనివారం 565 జాతీయ రహదారి నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ సమీపంలోని గిరికబాయి గూడెం బైపాస్ లో రోడ్డు నిర్మాణం కోసం ధ్వంసం చేసిన పంట పొలాలను వారు పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పానగల్ నుంచి సాగర్ రోడ్డు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం 14 కిలోమీటర్లు నిర్ణయించి 1,170 మంది బాధితులను గుర్తించారని, ఇంకా 35 శాతం బాధితులకు నోటీసులు, నష్టపరిహారం, అందలేదని అన్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా శుక్రవారం కాంట్రాక్టర్లు ఊట్కూరు వెంకట్ రెడ్డి భూమిలో వరి కోత దశ లో ఉన్న పొలాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు న ష్టపరిహారం ఇవ్వకుండా పంట పొలాలు ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పనులు ప్రారంభించాలని చేతికందే దశలో ఉన్న పొలాలకు కొంత సమయం ఇచ్చి పనులు చేయాలని కోరారు. నల్గొండ పట్టణ శివారులో ఎకరం రూ.2 కోట్లు ఉండగా ప్రభుత్వం 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వడం అన్యాయం అన్నారు. బహిరంగ మార్కెట్ కు రెండంతల ధర పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఆర్డీఓ అశోక్ రెడ్డికి భూ నిర్వాసితుల పోరాట కమిటి వినతిపత్రం అంద జే చేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఉట్కూరు వెంకట్ రెడ్డి, మహేష్,; రఘురామరాజు, మల్లారెడ్డి, దుబ్బాక నాగేష్, దుబ్బాక మల్లేష్, దొండ వెంకన్న మందడి పద్మమ్మ, నిదానంపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.