07-09-2025 01:02:40 AM
మేడ్చల్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో శనివారం వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. మేడ్చల్లో శక్తి యూత్ ఆధ్వర్యంలో జరిగిన నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్ హాజరయ్యారు. సందర్భంగా నిర్వహించిన కార్యక్ర మాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జాకాట దేవ, గుండ్ల పోచంపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.