calender_icon.png 27 July, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లీజ్ కాపాడండి..

27-07-2025 12:33:31 AM

- ప్రమాదంలో గాయపడిన యువతి ఆర్తనాదాలు

- షాద్‌నగర్‌లో బైక్‌ను ఢీకొన్న ట్యాంకర్

- తండ్రి స్పాట్ డెడ్.. టైర్లకింద పడిన కూతురు

- కాపాడాలంటూ స్థానికులకు విన్నపం.. అంతలోనే మృతి

షాద్‌నగర్, జూలై 26:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి బైక్‌ను ఢీ కొట్టడందో తండ్రి, కూతురు ప్రమాద స్థలిలోనే మృతిచెందారు. షాద్‌నగర్ పట్టణానికి చెందిన మచ్చేందర్ (48).. తన కూతురు మైత్రి (20) శంషాబాద్‌లోని వర్ధమాన్ కాలేజీకి వెళ్లేందుకని ఆమెను బైక్‌పై బస్టాండులో దిచేందుకు బయలుదేరాడు. ఇంతలోనే షాద్‌నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ వచ్చి బైక్‌ను ఢీకొనడంతో మచ్చేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు.

ట్యాంకర్ టైర్ల కింద పడిన మైత్రి.. కొన ఊపిరితో కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెట్టింది. తన వద్ద ఉన్న ఫోన్‌ను అతి కష్టమ్మీద తీసి అక్కడే ఉన్న తయబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడింది. ఇది చూసిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు. మైత్రికి తన స్నేహితురాల ఫోన్ చేయడంతో తయబ్ ప్రమాదం విషయం చెప్పాడు. అంతలోనే మైత్రి కూడా మృతిచెందింది. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.