calender_icon.png 11 July, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలో నాకు మద్దతివ్వండి

12-09-2024 02:51:17 AM

కళాశాలల అధ్యాపకులను కోరిన అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి

కరీంనగర్, సెప్టెంబరు 11 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కళాశాలల అధ్యాపకులను అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి కోరారు. బుధవారం కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మానకొండూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను డాక్టర్ వి నరేందర్ రెడ్డి సందర్శించారు.

శాసనమండలి ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపర్చి విజయం సాధించే దిశగా చేయూతనందించాలని కోరారు. విద్యావ్యవస్థ పట్ల పూర్తి అవగాహన ఉన్నదని, ప్రైవేట్ జూనియర్ కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడిగా అనుభవం ఉన్నదని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలో తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని కోరారు.