28-12-2025 12:40:25 PM
న్యూఢిల్లీ: ఆదివారం తన మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ 2025లో భారతదేశం సాధించిన గర్వకారణమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం నిబద్ధతను ప్రదర్శించి ప్రపంచంపై బలమైన ముద్ర వేసిందని ప్రధాని మోదీ చెప్పారు. పాకిస్తాన్ దుస్సాహసంపై చేపట్టిన ఈ ఆపరేషన్, భారతదేశం తన భద్రత విషయంలో రాజీ పడదని ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చిందన్నారు.
ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని, ప్రపంచంలోని నలుమూలల నుండి మాతృభూమి పట్ల ప్రేమ, భక్తిని చాటే చిత్రాలు వెలువడ్డాయి. వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఇదే స్ఫూర్తి కనిపించిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ కప్‌లో విజయాలు సాధించిన భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను ప్రశిస్తూ, ఈ విజయాలను 2025 సంవత్సరపు ప్రధాన విజయాలుగా అభివర్ణించారు.
క్రీడల పరంగా 2025 చిరస్మరణీయ సంవత్సరమని, మన పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని, మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌ను సాధించింది. మహిళల బ్లైండ్ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుని భారత ఆడబిడ్డలు చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలు సాధించడం ద్వారా, పారా-అథ్లెట్లు సంకల్పం ముందు ఏ అడ్డంకి ఆపలేదని మోదీ వివరించారు