calender_icon.png 28 December, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డా కార్మికులకు అల్పాహారం

28-12-2025 01:12:53 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తా మార్కెట్ ఏరియా తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అల్పాహారం పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదలు,అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, బాటసారులు, చిరు వ్యాపారస్తులకు 280 మందికి పైగా అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గెల్లీ జయరాం యాదవ్, గరిగె వేణు, గంట శ్రీనివాస్, భోగ శ్రీనివాస్, కన్నె వేణి రాజేష్, కుంభ ఓదెలు, నాగుల లింగయ్య, కోయాడ శంకర్ గౌడ్, కీర్తి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.