13 April, 2026 | 4:14 AM

సియాటిల్‌లో వివేకానందుడి విగ్రహావిష్కరణ

13-04-2026 01:13 AM

వాషింగ్టన్: స్వామి వివేకానందుడి విగ్రహం ఏర్పాటు సమగ్ర స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని, భారతదేశంఅమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని సియాటిల్ మేయర్ కేట్ విల్సన్ అన్నారు. వివేకానందుడి విగ్రహాన్ని విల్సన్‌తోపాటు శా న్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తాలు కలిసి ఆవిష్కరించారు. అత్యంత రద్దీగా ఉండే డౌన్‌టౌన్‌లో విగ్రహం ఏర్పాటు హర్షణీయమని,

రోజుకు ఈ ప్రాంతాన్ని 4 లక్షల మంది సందర్శిస్తుంటారని ప్రకాష్ గుప్తా తెలిపారు. విగ్రహావిష్కరణలో కెంట్, ఆబర్న్, తుక్విలా, నార్మాండీ పార్క్, కార్ల్ క్లాండ్ మేయర్లతో పాటు, బెల్లేవ్, బోథెల్, డుపాంట్, రెడ్మండ్లకు చెందిన సిటీ కౌన్సిల్ సభ్యులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సియాటిల్ నగరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది భారత ప్రభుత్వానికి ఓ మంచి బహుమతి అన్నారు.