17-01-2026 04:28:50 PM
చుంచుపల్లి,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సెంట్రల్ ఆటో వర్క్ షాప్ సూపర్ డెండెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో పనిచేయుచున్న ఆర్. రామ శేషయ్య జిల్లా గ్రంథాలయమునకు ఇంజనీరింగ్ బుక్స్, నీట్, ఐఐటి, జేఈఈ సంబంధించిన పుస్తకాలను వితరణగా ఇచ్చారు. వారికి గ్రంథాలయం తరఫున గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అభినందించారు. ఇలాంటి దాతలు ముందుకు వస్తానే గ్రంథాలయాల పోటీ పరీక్షల విద్యార్థులకు లాభం చేకూరుతుందని దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి.మణి మృదుల కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాల విద్యార్థిని విద్యార్థులు పాఠకులో పాల్గొన్నారు.