calender_icon.png 28 January, 2026 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజిత్ పవార్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్బ్రాంతి

28-01-2026 11:40:46 AM

హైదరాబాద్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణం ప్రజా జీవితానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో మృతుని కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.