08-11-2025 12:41:56 AM
ప్రభుత్వంతో చర్చలు సఫలం
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (ఫతి)తో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ఫతి నేతలు శుక్ర వారం ప్రజాభవన్‌లో భేటీ అయి చర్చలు జరిపారు.
అయితే ప్రభుత్వానికి రూ.1500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలివ్వాలని ఫతి నేత లు కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ...కళాశాల యా జమాన్యాలు బకాయిలకు సంబంధించి 1,500 కోట్లు అడిగారని, అయితే ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశామని, మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం, మరో రూ.300 కోట్లు కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.
ఈనెల 8న తలపెట్టిన అధ్యాపకుల సభ, 15న చేపట్టే విద్యార్థుల లాంగ్ మార్చ్ నిరసన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రైవేటు కళాశాల యాజమాన్యాల సంఘం అంగీ కరించిందని తెలిపారు. ప్రతి నెలా ఎంతోకొంత రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని భట్టి చెప్పారు. రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఒక కమిటీని ఇప్పటికే వేశామ ని, ఆ కమిటీ వీలైనంత త్వరితగతిన రిపోర్టు ఇవ్వాలని కోరారు. ఏ రకమైన సంస్కరణలు అవసరమో చర్చించి, ఆ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
చాలా బాధతో కాలేజీల బంద్‌ను పాటించామని ఫతి చైర్మన్ రమేశ్ బాబు తెలిపారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన, సీఎం కార్యాలయం అధికారులపై, డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులపై తాము ఎలాంటి వ్యా ఖ్యలు చేయలేదని చెప్పారు. తాము మీడియా సమావేశంలో ఒకటి మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని, ఇందుకు చింతిస్తున్నామన్నారు.
మా మాటలను వక్రీకరిస్తూ మీడియాలో వచ్చిన ప్రకటనల పై తమ సంఘం నుంచి ఒక ఖండన ప్రకటనను ఇప్పటికే అంశాన్ని ఐఏఎస్ అధికారుల సంఘానికి పంపామ ని తెలిపారు. ఈనెల 3 నుంచి కాలేజీలు బంద్‌లో పా ల్గొంటున్నాయని, దీంతో కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయినందుకు చింతిస్తున్నామన్నారు. నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్వహించే ఏర్పాటు చేస్తామన్నారు.
మమ్మల్ని ఆదుకోవాలి: రవికుమార్, ఫతి జనరల్ సెక్రటరీ
ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాయని, శనివారం నిర్వహించాల్సిన లెక్చరర్ల సభను రద్దు చేసుకుంటున్నామని ఫతి జనరల్ సెక్రటరీ రవికుమార్ తెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఇక నుంచి ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని, కుటుంబంలోని సభ్యుల్లాగా ఫీజురీయిం బర్స్‌మెంట్ బకాయి సమస్యను క్రమంగా పరిష్కరించాలని కోరారు. ఎన్నికల కోడ్ సమయంలో లెక్చరర్ల సభను నిర్వహించడం తప్పు అని కోర్టు చెప్పిందని, అందుకు విరమించుకున్నామని ఆయన తెలిపారు.