calender_icon.png 16 October, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ

16-10-2025 12:03:52 PM

హైదరాబాద్: శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) గురువారం నాడు దర్శించుకున్నారు. శ్రీశైలం మల్లన్న(Srisailam Mallanna) సేవలో ఆయన నిమగ్నమయ్యారు. భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం చేశారు. భ్రమరాంబకు ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో ప్రధాని పాల్గొన్నారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. శివాజీ దర్భార్ హాల్, ధ్యాన మందిరాలను నరేంద్ర మోదీ తిలకించనున్నారు.

కర్నూలు నుంచి హెలికాప్టర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలానికి బయలుదేరారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రధానమంత్రి గురువారం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పరిశ్రమ, విద్యుత్ ప్రసారం, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలను కవర్ చేస్తాయి. కర్నూలులో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టులను అధికారికంగా ప్రారంభించి, ఆ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.