16-10-2025 12:29:16 PM
మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనం.
శ్రీశైలం/నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని(PM Modi) దర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10:53 గంటలకు ప్రధానమంత్రి సున్నిపెంట హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకోగా, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను ట్రాన్స్పోర్ట్, ఆర్అండ్‌బి స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప ఉదయం 11 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆలయ దర్శనం కార్యక్రమం కొనసాగుతోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు