01-07-2025 12:47:45 AM
చేవెళ్ల, జూన్ 30:చేవెళ్ల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని చంద్రారెడ్డి నగర్ కాలనీ లో పోచమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా ని ర్వహించారు. సోమవారం చేవెళ్ల సహకార సంఘం చైర్మ న్ దేవర వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి , మాజీ సర్పంచ్ బండారు శైలజ ఆగిరెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గుండాల రాములుపాల్గొన్నారు.