01-07-2025 12:47:27 AM
మహబూబాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చాగంటి కిషన్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడానికి అనేక విధాలుగా ఉద్యమించినట్లు చెప్పారు.
స్వరాష్ట్ర కలను నెరవేర్చుకున్న సమయంలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వ జాక్ కన్వీనర్ మోడెమ్ రవిధర్ గౌడ్, పూర్వ విద్యార్ధి యువజన జాక్ కన్వీనర్ దండుశ్రీనివాస్, బాలమోహన్, సోమరాపు వెంకటయ్య, చిట్యాల వీరన్న, గాండ్ల మాలెందర్, కళాకారుడు వంగాల అశోక్, జనిగాలా పరమేష్, వేం వేంకట్ రెడ్డి, కీర్దీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.