08-11-2025 12:00:00 AM
స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు
నిర్మల్, నవంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయా ల్లో ఒకటైన అడెల్లి పోచమ్మ ఆలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రూ.6.6 కోట్లతో నూతన ఆలయం విగ్రహ ప్రతిష్టాపన చేపట్టగా ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, జి విట్టల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు తదితర ప్రముఖులు హాజరై.. ఉదయం 9:30 నిమిషాలకు నూతన ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు.
నాలుగు రోజులపాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా చివరి రోజు నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సమర్పిం చారు. భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొజాగౌడ్, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు