08-11-2025 12:00:00 AM
మేడిపల్లి నవంబర్ 7 (విజయక్రాంతి): పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో వందేమాతరం గీతం150 వసంతా లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలందరూ కలిసి సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించినట్లు కమిషనర్ టిఎస్‌విఎన్ త్రిలేశ్వరరావు తెలిపారు. సామూహి కంగా ప్రజలందరూ భాగస్వాములై ఆలపించడం శుభసూచకం అన్నారు.
ఈ కార్యక్ర మంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శోభా శంకర్, డి ఈ సాయినాథ్ గౌడ్, ఏఈ వినీల్ కుమార్ గౌడ్, మేనేజర్ క్రాంతి కుమార్,ఆర్వో కిషోర్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, జే ఏవో సుమలత ల తో పాటు కార్యాలయ సిబ్బంది వార్డు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎందరో మహానుభావుల త్యాగాలు ఎనలేనివి
స్వతంత్ర పోరాటంలో భాగంగా బకించంద్ర చటర్జీ రచించిన వందేమాతర గేయం, ఈరోజు 150 సంవత్సరాలు పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం బోడుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సి పల్ సిబ్బంది, స్థానిక నాయకులు, వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఎందరో మహాను భావుల, త్యాగాలను, ధైర్యసాహసాలను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శ్యాంసుందర్రావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.