08-11-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 (విజయ క్రాంతి ): జిల్లాలో భూముల సర్వే వచ్చిన ఫిర్యాదులను పరిష్కారం చేసేందుకు అధికారులు చోరువ చూపాలని, ఫిర్యాదు ఎందుకు పరిష్కారం కాలేదు తగు వివరణ ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సంబంధిత ఏడి సర్వే అధికారిని ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్లోని ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రికార్డుల భూముల సర్వే పై ప్రజలు ఇబ్బందికి గురవుతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని వారిని కార్యాలయం చుట్టూ తిరిగిన పరిష్కారం లభించనందున తాను తనిఖీ చేస్తున్నానని ఆయన తెలిపారు. ల్యాండ్ సర్వేలపై అనేక ఫిర్యాదులు పరిష్కరించకుండా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆ సమస్యపై పరిష్కరించకపోవడానికి గల కారణాలను సంబంధిత ఫిర్యాదుదారునికి తెలియ జేయాలని, కార్యాలయ సిబ్బంది తగు విధంగా స్పందించి ప్రజల ఫిర్యాదు పరిష్కరించాలని అన్నారు.
ప్రభుత్వ సంస్థల భూములలో ప్రైవేట్ వారి భూముల సర్వేలో కచ్చితంగా వ్యవహరించాలని, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు తెలిపితే సంబంధికుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏడి సర్వే అండ్ ల్యాండ్ అధికారిని ఆదేశించారు. అనంతరం పలు సర్వేల ఫిర్యాదులను, పైల్స్ లను తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులు అప్పిల్ కు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు.