29-10-2025 12:00:00 AM
బాన్సువాడ, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్, చించోల్లి, బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో మంగళవారం అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచా రం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..
నియోజవర్గంలో రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి డీఎస్‌ఓ తో ఫోన్‌లో మాట్లాడి లారీలకోసం ఎదురు చూడకుండా తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంట వెంటనే ట్రాక్టర్లలో రైస్ మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు సైతం రైస్ మిల్లు వద్ద వెంట వెంటనే ధాన్యం బస్తాలను దింపుకోవాలి అని రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని తెలిపారు.
వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని, తూకం వేసిన బస్తాలు, ధాన్యం రాశులపై పాలిథీన్ కాగితాలను కప్పుకోని వరి ధాన్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం రైతులు ఇబ్బంది పడకుండ ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించే విషయంలో రైస్ మిల్లర్లతో అండగా ఉండాలని ఆదేశించారు.