calender_icon.png 31 October, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలీబాబా నలుగురు దొంగలు..

29-10-2025 12:00:00 AM

  1. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత సంతోష్‌రావులు.

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి 

నిజామాబాద్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి):  గత కెసిఆర్ ప్రభుత్వం  పేదవాడికి ఏమి చేయకుండా  ఆలీబాబా నలుగురు దొంగలు లెక్క కెసిఆర్ హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులు తెలంగాణ దోచుకున్నారని  తీవ్రంగా  రూరల్ ఎమ్మెల్యే  భూపతి రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో మోపాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన  తాటి పత్రిల   పంపిణీ కార్యక్రమంలో  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కెసిఆర్, వారి కుటుంబ సభ్యులు తెలంగాణ పై పడి ప్రజల సొమ్మును దోచు కున్నారని విమర్శించారు. ముసలి కన్నీరు కారుస్తూ, మాజీ ఎంపీ కవిత మోపాల్ మండలంలో తిరుగుతూ పోడు భూముల గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  అన్నారు. పదేళ్లు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు  పోడు భూముల గురించి ఊసే లేదని, దళితులకు మూడెకరాలు ఇస్తామని పదేళ్ల ప్రభుత్వంలో వారిని మోసం చేయడం జరిగిం దన్నారు. 100 ఎలుకలు తిన్న పెళ్లి తీర్థయాత్ర చేసినట్టు  కవిత  వ్యవహారం ఉన్నదని అన్నారు.

పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని ఇంతవరకు ఇయ్యలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కలను నిజం చేసిందని, కేవలం  నిజామాబాద్ రూరల్ 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు చేయని పనిని కేవలం రెండు సంవత్సరాల లో ప్రజలకు సంక్షేమ పథకాలు ఉచిత రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు , 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, 500 లకు గ్యాస్ సిలిండర్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు సంక్షేమ కోసం రైతు భరోసా, రుణమాఫీ, 10 లక్షల వరకు ఆరోగ ్యశ్రీ   వంటి పథకాలను  అందజేశామని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఎంతో ఆకర్షితులైతున్నారని ప్రజల కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, గ్రామ సర్పంచ్ లుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.  అనంతరం జిల్లా వ్యవసాయ  మార్కెట్  కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తాటి పత్రులను మోపాల్ మండల  కేంద్రంలోని  ప్రాథమిక సహకార సంఘంలోని రైతులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  పంపిణీ చేశారు.

ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మోపాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, పిసిసి డెలికేట్ శేఖర్‌గౌడ్, మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాయి రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.