29-07-2025 05:37:03 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలో గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో బియస్సీ అగ్రికల్చర్ కాలేజీ భావన నిర్మాణానికి స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) పరిశీలించారు. పరిశోధన కేంద్రం అధికారి సమతా పరమేశ్వరీని స్థలం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, రుద్రూర్ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.