calender_icon.png 30 July, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ గేమ్ ఛేంజర్స్ గా చరిత్రలో నిలిచిపోతాయి

29-07-2025 05:47:50 PM

గత పాలకులు 10,600 కోట్లు ఖర్చు పెట్టి 89.95 లక్షల కార్డులకి 2.80 కోట్ల మందికి దొడ్డు బియ్యం పంపిణి చేసి ప్రజాధనం దుర్వినియోగం..

396 కోట్ల రూపాయలతో 10 వేల ఎకరాలకు నీరు అందించే రాజీవ్ గాంధీ దొండపాడు-2 లిఫ్ట్ కు క్యాబినెట్ ఆమోదం.

ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ ఇండ్లు,రేషన్ కార్డులు.

రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్

హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో పేదవారి కడుపు నింపి ఆహార భద్రత కల్పించే సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు పంపిణి లాంటి సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలో నిలిచిపోతాయని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Nalamada Uttam Kumar Reddy) అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కౌండిన్య ఫంక్షన్ హాల్ లో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకి నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ లతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ చరిత్రలోనే హుజూర్ నగర్ నుండి సన్న బియ్యం పంపిణి చేసిన ఉగాది పర్వదినం నిలిచిపోతుందని, తిరుమలగిరి నుండి నూతన రేషన్ కార్డులు పంపిణి సూర్యాపేట జిల్లా నుండి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా నుండి ప్రారంభించిన రెండు పథకాలు చరిత్రలో గేమ్ చెంజర్స్ గా నిల్చిపోతాయన్నారు.గతంలో 10,600 కోట్లు ఖర్చు పెట్టి 89.95 లక్షల కార్డులకి 2.80 కోట్ల మందికి దొడ్డు బియ్యం పంపిణి చేస్తే ప్రజాధనం దుర్వినియోగం అయిందని అందుకే పేదవారి కడుపు నింపేలా 13,000 కోట్లతో 97.90 లక్షల కార్డులకి 3.10 కోట్ల మందికి కేజీ 57 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం  ఉచితంగా పంపిణి చేస్తున్నామని అన్నారు. రైతులకి సన్న వడ్లు పండించేందుకు బోనస్ 500 ఇస్తున్నామని,సన్న వడ్లు సేకరించి మిల్లింగ్ చేసి దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వారు కడుపు నిండా తినేలా రాజకీయాలకు అతీతంగా నూతన కార్డులు,సన్న బియ్యం పంపిణి చేస్తున్నామని తెలిపారు.

చింతలపాలెం మండలంలో గతంలో 12,000 కార్డులుంటే 1116 కొత్తగా ఇచ్చామని, గరిడేపల్లి మండలంలో పాతవి 17000 ఉంటే కొత్తవి 2446, హుజూర్ నగర్ మండలంలో పాతవి 18000, కొత్తవి 2300, మట్టంపల్లి మండలంలో పాతవి 13,800 ఉంటే కొత్తవి 1400, మేళ్లచెర్వులో పాతవి 11,000 ఉంటే కొత్తగా 1200,నేరేడుచర్ల లో పాతవి  11,000 ఉంటే కొత్త కార్డులు 1700 అలాగే పాలకీడులో 7000 పాతవి ఉంటే కొత్త కార్డులు 812, నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 11,000 కార్డులు నూతనంగా మంజూరు చేశామన్నారు. కొత్త కార్డుల ద్వారా 52,000 మందికి సన్న బియ్యం తినే హక్కు కల్పించామని తెలిపారు.18 సంవత్సరాల తర్వాత జూలై మాసంలో సాగు నీరు వదలటం జరుగుతుందని నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇందిరా గాంధీ ప్రారంభించారని నేటికీ చెక్కు చెదరలేదు అన్నారు.

396 కోట్ల రూపాయలతో 10,000 ఎకరాలకి నీరు అందించే రాజీవ్ గాంధీ లిప్ట్ ఇరిగేషన్ దొండపాడు-2 కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రములోనే నెంబర్ 1గా చేస్తానని మంత్రి ఉత్తమ్ తెలిపారు.రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి,ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...గత పాలకులు పదేళ్లు ఒక్క రేషన్ కార్డు,ఇల్లు ఇవ్వలేదని ఇందిరమ్మ రాజ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు.200 యూనిట్ల కరెంట్, ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాలు,అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని తెలిపారు.

సూర్యాపేట జిల్లా కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి,జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల కృషితో ప్రతి పేదవారికి ఆహార భద్రత కల్పించే సన్న బియ్యం,నూతన రేషన్ కార్డులు పంపిణి ప్రారంభించటం మన జిల్లా ప్రజల అదృష్టం అని అన్నారు.రేషన్ కార్డులు రాని వారు ఎవరు ఆందోళన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్,సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహన్,జిల్లా ఎస్పి కే నరసింహ,అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ శ్రీనివాసులు,డిఎస్ఓ మోహన్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికఅరుణ్ కుమార్,చక్కర వీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున్ రావు,అజీజ్ పాషా,తదితరులు, పాల్గొన్నారు.