calender_icon.png 8 May, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారం, రవీందర్‌రెడ్డి అనుచరుల వార్

25-03-2025 12:00:00 AM

వర్నిలో అర్ధరాత్రి ఇరువర్గాల వీరంగం

కామారెడ్డి, మార్చి 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు, మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రె స్ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరుల మధ్య ఆదివారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు ఘర్షణ వాతా వారణం నెలకొంది.

వర్నికి చెందిన ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎలమంచలి శ్రీనివాస్‌రావుపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు కత్తులు, కర్రలతో దాడికి వచ్చారని ఆరోపిస్తూ రవీందర్‌రెడ్డి అనుచరులు శ్రీనివాస్‌రావును రక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. పోచారం అనుచరులను తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. మూడు గంటల పాటు ఉద్రికత్త చోటు చేసుకుంది. ఇరువర్గాలు తోపులాడుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పారు.

ఈ ఘటన బాన్సువాడ నియోజకవర్గంలో చర్చనీయంశంగా మారింది. పోచారం కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రవీందర్‌రెడ్డి అనుచరులకు మార్కెట్ కమిటి పదవులు కట్టుపెట్టకుండా పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచరులకు దక్కడంతో మరింత వర్గపోరు ముదిరింది.