calender_icon.png 8 May, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్‌తో తిప్పలు

25-03-2025 12:00:00 AM

మూసివేతకు ప్రజల డిమాండ్, సబ్ కలెక్టర్‌కు వినతి

కామారెడ్డి,  మార్చి 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద శివారులోని సర్వే నెంబర్ 512 లో కొనసాగుతున్న స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్ లను మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  వాటి నిర్వహణతో నిత్యం ప్రజల అవస్థలు పడుతున్నారని సబ్ కలెక్టర్కు కిరణ్ మైకి ఫిర్యాదు చేశారు.  గత రెండు రోజుల క్రితం గోపన్పల్లి గ్రామానికి వచ్చిన సబ్ కలెక్టర్కు కు వివరించారు.

గ్రామంలోని ప్రజలు క్రషర్, డాంబర్ ప్లాంట్ల వల్ల కాలుష్యం, ధూళి, శబ్ధ కాలుష్యం వంటి సమస్యలతో నిత్యము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వీటివల్ల గాలి, నీటి కాలుష్యానికి కారణమవుతోందని చెప్పుకొచ్చారు. దీంతో దుమ్ము, ధూళి గ్రామంలోని ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వాపోయారు. 

అంతేగాకుండా స్టోన్ క్రషర్ లో బాంబుల పేళుల్లకు వచ్చే శబ్దం వల్ల ఇండ్లకు బీటలు పడుతున్నాయని, అదేవిధంగా గ్రామంలోని ప్రజలకు నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్లాంట్ల కార్యకలాపాలను, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని   గోపనపల్లి గ్రామస్థులే కాకుండా బిచ్కుంద మండల కేంద్రం వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు.  మైనింగ్ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే స్టోన్ క్రషర్ డాంబర్ ప్లాంట్లపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రామస్థుల ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల పరిధిలోని డాంబర్ ప్లాంట్ స్టోన్ క్రషర్ బంద్ చేయాలని గ్రామాల ప్రజలు ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని తెలిపారు. విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సిజ్  చేస్తా మన్నారు.

 సతీష్, మైనింగ్ టడి, కామారెడ్డి.