26-08-2025 05:37:27 PM
హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో వ్యవహారాలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Chevella MP Konda Vishweshwar Reddy) వినూత్న నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా చేవెళ్లే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇచ్చారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని కొండా మండిపడ్డారు. చంద్రశేఖర్ తివారీని కలిస్తే.. రామచందర్ రావును కలవమంటున్నారు.. రామచందర్ రావును కలిస్తే.. అభయ్ పాటిల్ ను కలవమంటున్నారని వాపోయారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతన్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయలోపంపై చేవెళ్ల ఎంపీ ఫైర్ అయ్యారు.