01-08-2025 10:41:49 PM
కంగ్టి (విజయక్రాంతి): మండల పరిధిలోని బీమ్ర గ్రామంలోని ఓ కిరాణా షాప్ లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ వెంకటరెడ్డి(CI Venkata Reddy) ఎస్సై దుర్గా రెడ్డి(SI Durga Reddy) తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి 12 గంటలకు మెరుపు దాడి నిర్వహించి, వారి నుండి రూ.9260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.
పేకాట ఆడుతూ దొరికితే తాట తీస్త: సీఐ వెంకటరెడ్డి
మండల వ్యాప్తంగా ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఉంటే 8712656734-8712656760 నంబర్లకు తెలియజేయగలరని అన్నారు. తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతుందని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు ఉంటాయని సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు.